‘ప్రజలను చంపుకొని తినే క్రూరమైన ప్రభుత్వమిది’.. సంజయ్‌ రౌత్‌పై కేసు

Case Against MP Sanjay Raut For Spreading Fake News - Sakshi

సాక్షి, ముబై: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై శుక్రవారం మెరైన్‌లైన్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. శిందే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు సంజయ్‌ శిర్సాట్‌, భరత్‌ గోగవావలే కిరణ్‌ పావస్కర్‌ మెరైన్‌ లైన్స్‌ పోలీసు స్టేషన్‌ సీనియర్ ఇన్‌స్పెక్టర్‌ నీలేశ్‌ బాగుల్‌కు ఫిర్యాదు చేశారు. రౌత్ చేసిన ఆరోపణలు సమాజంలో విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు.

న్యూ ముంబై ఖార్‌ఘర్‌లో గత ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వడదెబ్బ తగలి చనిపోయిన వారు 14 మంది కాదని దాదాపు 50-75 మంది ఉన్నారని గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రౌత్‌ ఆరోపించారు. అంతేగాకుండా మృతుల సంఖ్యను తక్కువ చూపించేందుకు మృతుల కుటుంబ సభ్యులు, బందువుల ఇళ్లకు వెళ్లి లక్షల్లో డబ్బులు ఎరచూసాన విమర్శించారు. శిందే నోటికి తాళం పడిందా? అసలు మృతుల సంఖ్య ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు.

మననుషల ప్రాణాలకు విలువలేదు. డబ్బుతో వెల కడుతున్నారని దుయ్యబట్టారు. నిర్వాహకుల నిర్లక్ష్యంవల్లే ఇంతమంది చనిపోయారని, మృతులకు కారకులైన శిందే, ఫడ్నవీస్‌ పదవుల్లో కొనసాగే అధికారం లేదని, కింటనే రాజీనామా చేయలని డిమాండ్‌ చేశారు. ప్రజలను చంపుకు తినే క్రూరమైన ప్రభుత్వమిదని మండిపడ్డారు. మొత్తం 14 మంది మృతుల్లో 12 మంది ఏడు గంటలకుపైగా ఎండతో ఉపవాసంతో ఉండటంవల్ల మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. దీంతో రౌత్‌ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లైంది.

కాగా, శిందే, ఫడ్నవీస్‌లపై మనుష్యవథ కేసు నమోదు చేయాలని సంఘటన జరిగిన తరువాత అదే రోజు అజిత్‌పవార్‌, సంజయ్‌ రౌత్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ గురువారం విలేకరుల ఎదుట సంజయ్‌ చేసిన విమర్శలు సమాజంలో విభేదాలు సృష్టించేలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top