బోట్‌వాలాకు ఐటీ నోటీసులు, 45 రోజుల్లో 30 కోట్ల సంపాదన ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌ | Boatman Pintu Mahara Received Tax Notice After Earning 30 Crore In 45 Days Of Maha Kumbh, Requesting Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

Pintu Mahara: బోట్‌వాలా పింటు మహరా 45 రోజుల్లో 30 కోట్ల సంపాదనలో ట్విస్ట్‌.. ఏంటంటే?

Published Sun, Mar 16 2025 9:51 PM | Last Updated on Mon, Mar 17 2025 8:50 AM

Boatman Pintu Mahara Tax Notice After Earning 30 Crore in 45 Days of Maha Kumbh Mela

లక్నో: మహాకుంభమేళా (maha kumbh 2025) పడవ వ్యాపారి పింటు మహరా (pintu mahara) రూ.౩౦కోట్ల సంపాదనలో ట్విస్ట్‌ చేసుకుంది. తాను ఒక్కబోటు మీద రూ.30 కోట్లు సంపాదించలేదని, పదుల సంఖ్యలో పడవలు ఉండగా.. కుంభమేళా కోసం అదనంగా మరిన్ని పడవలు కొనుగులో చేసినట్లు పింటు మహరా చెబుతున్నారు. ఇందుకోసం తన ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు చెప్పారు. అయితే, ఐటీ అధికారులు తనకు నోటీసులు  (12.8 Crore Rupees Tax Notice) జారీ చేయడంపై.. ఆ మొత్తాన్ని ఎలా చెల్లించాలో అర్ధం కావడం లేదని తలలు పట్టుకుంటున్నాడు. ఇదే అంశం విషయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాడు.  

మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుకను ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగీ ప్రభుత్వం విజయ వంతం చేసింది. భారతీయ ఆధ్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపంగా భావించే మహా కుంభమేళా భక్తితో పాటు ఆర్థికంగా కొన్ని కోట్లాది మంది జీవితాల్ని మార్చేసింది. వారిలో ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమం తీరాన ఉన్న అరైల్ గ్రామానికి చెందిన పడవ వ్యాపారి పింటు మహరా.

సీఎం యోగి నోట.. 
కుంభమేళా జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగిసింది. అయితే, పడవ వ్యాపారం చేసుకునే పింటు మహరా 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించారు. దీంతో పింటు పేరు సోషల్‌ మీడియాలో మారుమ్రోగింది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం యోగి ఆధిత్యనాథ్‌ (Yogi Adityanath) పింటు పేరును ప్రస్తావించారు. కుంభమేళా వల్ల పింటు రూ.౩౦కోట్లు సంపాదించడమే కాదు,౩౦౦ మందికి పరోక్షంగా ఉపాధి అవకాశం కల్పించామని చెప్పాడు.  
 
సీఎం యోగి ప్రకటనతో ఐటీ శాఖ నోటీసులు? 
సీఎం యోగి ఆధిత్యనాథ్‌ ప్రకటన ప్రకారం.. పింటు మహరా కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. జనవరి 23 నుండి ఫిబ్రవరి 26 వరకు ఒక్కో పడవ సగటున రూ. 23 లక్షల లాభాల్ని అర్జించారని పేర్కొన్నారు. అంతే, సీఎం యోగి ప్రకటనతో ఆదాయపు పన్ను శాఖ పింటు మహరా రూ. 12.8 కోట్ల పన్ను నోటీసు జారీ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రూ.12.8కోట్లు ట్యాక్స్‌ అంటే ఎలా?
ఆదాయపు పన్నుశాఖ పింటు మహ్రాకు నోటీసులు పంపిందనే సమాచారంపై సెబీ రిజిస్టర్డ్‌ ఫైనాన్షియల్‌ ప్లాన్‌ ఏకే నందన్‌ స్పందించారు. పింటు మహరా రోజుకు రూ. 500 సంపాదించే సాధారణ పడవ వ్యాపారి. మహాకుంభమేళాతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. భక్తుల రద్దీతో ఒక్కో ప్రయాణానికి ఛార్జీ వేలల్లో వసూలు చేశారు. ఫలితంగా తన మొత్తం ఆదాయం రూ. 30 కోట్లకు చేరింది. అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ రూ.12.8 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు అందించడంతో ఆందోళన చెందుతున్నాడని అన్నారు.  పన్నుల గురించి తెలియని ఒక సామాన్యుడు ఇప్పుడు పెద్ద మొత్తంలో పన్నుల భారాన్ని ఎదుర్కోవడం బాధాకరం’ అని అన్నారు. పింటూ మహర కుటుంబం ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు. అయితే, ఈ అధిక ఆదాయం పన్ను చట్టాల ప్రకారం పెద్ద మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టిందన్నారు.  

ఆస్తుల్ని తాకట్టు పెట్టి
మరోవైపు, పింటు మహర రూ.౩౦కోట్ల సంపాదనలో ట్విస్ట్‌ చేసుకుంది. 42 రోజుల్లో తాను ఒక్క పడవమీదే రూ.౩౦ కోట్లు సంపాదిస్తున్నానని అనుకుంటున్నారు. అదేం లేదు.కుంభమేళాకు ముందు తన వద్ద 60 బోట్లు ఉండేవి. కుంభమేళా రద్దీని అంచనా వేసి మరో 70 బోట్లు అప్పు చేసి కొన్నా. అందుకోసం ఇంట్లో నగలు, ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చినట్లు పలు మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement