స్కూల్‌ బస్సులో చిన్నారిపై కామాంధుడి దాష్టీకం.. ఆగ్రహావేశాల నడుమ ఇల్లు నేలమట్టం

Bhopal Rapist House Demolished Video - Sakshi

భోపాల్‌/రేవా: స్కూలు బస్సులోనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడాడు ఓ మృగం. మూడున్నరేళ్ల చిన్నారిపై కామాంధుడి దాష్టీకం ఆలస్యంగా వెలుగుచూసింది. భోపాల్‌లో ఈ నెల 8న ఈ దారుణం జరిగింది. నగరంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నర్సరీ చదివే చిన్నారి ఇంటికెళ్లాక.. ఆమె బ్యాగ్‌లో ఉండాల్సిన స్పేర్‌ దస్తులు మార్చేసి ఉన్నాయి. పైగా ప్రైవేట్‌ భాగాల్లో నొప్పిగా ఉందని తల్లికి చెప్పింది. తల్లి ఆరాతీయడంతో జరిగిన దారుణం వెలుగు చూసింది.

బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఘటనపై  స్కూల్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వాళ్లు నిర్లక్ష్యంగా స్పందించారు. పైగా ఘటన జరిగిన రోజు బస్సులోని సీసీటీవీ ఫుటేజీని మాయం చేశార. దీంతో ఆ పేరెంట్స్‌  పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు.. బస్సు డ్రైవర్‌ను, ఘటన జరిగినపుడు సహకరించిన మహిళా హెల్పర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

డ్రైవర్‌ అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చేశారు. ఈ మేరకు అక్రమ కట్టడంగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసిన అధికారులు.. పోలీసుల సమక్షంలో షాపురా ఏరియాలోని నిందితుడి ఇంటిని నేలమట్టం చేశారు. ఘటన గురించి తెలిసి ఆగ్రవేశాలతో ఉన్న స్థానికులతోనే ఆ ఇంటిని అధికారులు నేలమట్టం చేయించడం విశేషం. ఇదిలా ఉంటే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. స్కూల్‌ యాజమాన్యం ధోరణిపైనా మండిపడ్డారు హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా.

video courtesy: IBC24 

ఇదీ చదవండి: నాకు మా అమ్మ కావాలి.. గుండెల్ని పిండేస్తున్న చిన్నారి రోదన

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top