ఆర్మీ జవాన్‌ మృతి.. సైనిక దుస్తుల్లో నాన్నకు సెల్యూట్‌

belagavi: Army Jawan Died, Son Salute To Father In Military uniform - Sakshi

సాక్షి, బెంగళూరు: సైన్యంలో పనిచేసే కన్నతండ్రికి సైనిక దుస్తుల్లో నివాళులర్పించిన చిన్నారి తనయుడు అందరినీ కంటతడి పెట్టించాడు. నాగాల్యాండ్‌లో ఆర్మీ జీపు బోల్తా పడి కర్ణాటకలో బెళగావి జిల్లా శివపురకు చెందిన ఆర్మీ జవాన్‌ (డ్రైవర్‌) మంజునాథ గౌడన్నవర మరణించారు. ఆయన భౌతికకాయానికి మంగళవారం స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఆర్మీ యూనిఫాంలో ఆయన తనయుడు స్వరూప్‌ (5) సెల్యూట్‌ చేస్తుండగా ఓదారుస్తున్న బెళగావి ఎంపీ మంగళా అంగడి. బాలున్ని ఆ పరిస్థితిలో చూసిన గ్రామస్తుల మనసులు చలించాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top