
ఎస్.ఎల్.వి–3. టీమ్;ఎడమ నుంచి రెండో వ్యక్తి అబ్దుల్ కలామ్
భారతదేశపు ఉపగ్రహ వాహ నౌక ఎస్.ఎల్.వి.–3 భారతదేశపు తూర్పు తీరం నుంచి 1980 జూలై 18 న రివ్వున నింగికి ఎగిరి అదృశ్యమైంది. అంతరిక్ష పరిశోధనలో అగ్రగణ్యమైనవిగా పేరుపొందిన దేశాలు తయారు చేసిన వాటితో పోల్చుకుంటే ఆ రాకెట్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేకపోవచ్చు. కానీ, భారీ రాకెట్ లాంచర్ల వరుసలో ఎస్.ఎల్.వి.–3 మొదటిది.
వాటి కారణంగానే 1990ల కల్లా భారదేశానికి గణనీయమైన అంతరిక్ష శక్తిగా పేరు వచ్చింది. ఈ రాకెట్ తనను తయారు చేసిన జట్టు నాయకుడు డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్‌కు కూడా ఖ్యాతి తెచ్చిపెట్టింది. భారతదేశంలోని టెలిఫోన్ కంపెనీలు, టెలివిజన్ చానల్స్ స్వదేశంలో నిర్మించిన ఉపగ్రహాల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. తద్వారా దేశానికి కోట్ల కొద్దీ విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా, అంతరిక్ష కార్యక్రమం భారతీయ వైజ్ఞానిక సంస్థల నిర్వహణ విధానాన్ని మార్చేసింది. మేనేజ్‌మెంట్ స్థానంలో ‘మిషన్ అప్రోచ్’ చోటు చేసుకుంది.
తల్లి ఇందిరతో సంజయ్‌గాంధీ
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
– తిరిగి పదవిలోకి వచ్చిన ఇందిరాగాంధీ
– భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం
– విమాన ప్రమాదంలో సంజయ్‌గాంధీ దుర్మరణం