స్టేషన్ల అభివృద్ధి పేరిట.. రైల్వే ఛార్జీలు పెంచనున్నారా..? | Ashwini Vaishnaw Says No Rise In Rail Fares | Sakshi
Sakshi News home page

స్టేషన్ల అభివృద్ధి పేరిట.. రైల్వే ఛార్జీలు పెంచనున్నారా..? రైల్వే మంత్రి క్లారిటీ..

Aug 6 2023 9:18 PM | Updated on Aug 6 2023 9:26 PM

Ashwini Vaishnaw Says No Rise In Rail Fares - Sakshi

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్దరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పనుల కోసం రైల్వే ఛార్జీల ధరలు పెంచుతారనే ఊహాగానాలు పట్టాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల నీవకరణకు కావాల్సిన నిధుల కోసం టికెట్టు ధరలు పెంచుతారనే అనుమానాలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రైల్వే ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. 

రైల్వే స్టేషన‍్ల పునరుద్ధరణకు కావాల్సిన రూ.25 వేల కోట్లను బడ్జెట్ నుంచే కాటాయించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రాజెక్టు పేరుతో ఛార్జీలను పెంచడం జరగదని వెల్లడించారు. రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచస్థాయి స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్ల అభివృద్ధిలో ఏ రాష్ట్రంలో వివక్ష చూపలేదని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫలితాలను ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. 

ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement