Karni Sena Chief’s Killing Case: కర్ణిసేన చీఫ్‌ హత్య..మరో నిందితుడి అరెస్టు | Another Accused Ashok Kumar Arrested In Karni Sena Chief Murder Case - Sakshi
Sakshi News home page

Karni Sena Chief’s Killing Case: కర్ణిసేన చీఫ్‌ హత్య..మరో నిందితుడి అరెస్టు

Jan 3 2024 8:02 PM | Updated on Jan 3 2024 8:27 PM

Another Accused Arrested In Karnisena Chief Murder Case - Sakshi

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ గొగామెడి హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు అశోక్‌ కుమార్‌ను నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) బుధవారం అరెస్టు చేసింది. తాజా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.

ఈ హత్యకు సంబంధించి రాజస్థాన్‌, హర్యానాల్లోని 31 ప్రదేశాల్లో  బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. తాజాగా అరెస్టయిన నిందితుడు అశోక్‌కుమార్‌ కర్ణిసేన చీఫ్‌ హత్య తామే చేశామని క్లెయిమ్‌ చేసుకున్న గ్యాంగ్‌స్టర్‌ రోహిత్‌ గోడారాకు సన్నిహితుడు.

‘కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం(జనవరి 3)న హర్యానా, రాజస్థాన్‌లోని 31 ప్రాంతాల్లో సోదాలు జరిపాం. వీటిలో నిందితులకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. సోదాల్లో భాగంగానే అశోక్‌ కుమార్‌ అనే నిందితుడిని రాజస్ధాన్‌లోని జున్‌జున్‌లో అరెస్టు చేశాం’ అని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.

గత ఏడాది డిసెంబర్‌ 5వ తేదీన జైపూర్‌లోని శ్యామ్‌నగర్‌లో ఉన్న ఆయన ఇంట్లోనే కర్ణిసేన చీఫ్‌ గొగామెడిని ముగ్గురు షూటర్లు  కాల్చిచంపారు. పట్టపగలు జరిగిన ఈ హత్య సంచలనం రేపింది.  హత్య తర్వాత రాజస్థాన్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.   

ఇదీచదవండి..మహువా పిటిషన్‌..లోక్‌సభ సెక్రెటరీకి సుప్రీం నోటీసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement