ఈ నెల 14 నుంచి అన్నా హజారే నిరాహారదీక్ష | Anna Hazare declares indefinite strike from Feb 14 to oppose Maha govt | Sakshi
Sakshi News home page

ఈ నెల 14 నుంచి అన్నా హజారే నిరాహారదీక్ష

Feb 10 2022 6:26 AM | Updated on Feb 10 2022 6:26 AM

Anna Hazare declares indefinite strike from Feb 14 to oppose Maha govt - Sakshi

పుణే: మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే ప్రకటించారు. సూపర్‌మార్కెట్లు, కిరాణా కొట్లలో వైన్‌ అమ్మకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తున్న అన్నాహజారే ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్దవ్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రప్రజలు కోరుతున్నారని ఆయన లేఖలో వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో 14 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement