గర్భవతిని చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నాడు : నటి చాందినీ

Actress Chandini Sexual Abuse Complaint On Ex Minister Manikandan - Sakshi

పెళ్లి పేరుతో మాజీ మంత్రి నిర్వాకం

ప్రేమ-పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన ఓ మాజీ మంత్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్​లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన చాందినీ.. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డాక్టర్​ మణికందన్​పై సంచలన ఆరోపణలు చేసింది. తనతో సహజీవనం చేసి గర్భవతిని చేసిన మణికందన్​.. ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె మీడియా ముందుకు వచ్చింది. 

చెన్నై: కోలీవుడ్ నటి చాందినీ అన్నాడీఎంకే నేత మణికందన్​ మీద ఛీటింగ్, లైంగిక దాడి కేసులు పెట్టింది. గత ఐదేళ్లుగా తామిద్దరం రిలేషన్​షిప్​లో ఉన్నామని, తాను గర్భవతిని అని తెలిశాక అబార్షన్​ చేయించాడని ఆమె మీడియా ముందు వాపోయింది. పెళ్లి చేసుకోమంటే కుదరదని అన్నాడని, గట్టిగా మాట్లాడితే తన గుండాలతో చంపిస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ మేరకు మణికందన్​తో జరిగినట్లుగా వాట్సాప్​ ఛాటింగ్​లను ఆమె మీడియాకు చూపించి పోలీసులకు సమర్పించింది.

కాగా, 36 ఏళ్ల చాందినికి మలేషియా పౌరసత్వం ఉంది. ‘నడడిగల్​, వాగి సూడా వా’ సినిమా లాంటి సినిమాల్లో ఆమె నటించింది. ఇక మణికందన్​ గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. జయలలితకు ఆప్తుడిగా పేరున్న 41 ఏళ్ల మణికందన్​.. అప్పటి మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్​పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పళనిస్వామికి వ్యతిరేకంగా టీవీవీ దినకరన్​ వేరు కుంపటిలో చేరి మంత్రి పదవిని పొగొట్టుకున్నాడు. కాగా చాందినీ ఆరోపణలపై మణికందన్‌ స్పందన తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top