‘సీఎం సాబ్‌... నాకు పెళ్లి కూతురుని చూడండి’

26 Year Old Man Went To Police Station And Demand Getting Him Married - Sakshi

ప్లీజ్‌‌ పెళ్లి చేసిపెట్టండంటూ పోలీసులకు యువకుడి విన్నపం

లక్నో: ఉత్తరప్రదేశ్‌ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో విసిగిపోయిన ఓ కుర్రాడు ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాశాడు. అంతేగాక అమ్మాయి తప్పనిసరిగా చదువుకుని ఉండాలని కండిషన్‌ కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలో పబ్లిక్‌ సర్వీసులో భాగంగా  తనకు పెళ్లి చేయమంటూ బుధవారం పోలీసు స్టేషన్‌కు వెళ్లి విన్నవించుకున్న సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. వివరాలు.. అజీమ్‌(26) అనే వ్యక్తి స్థానికంగా కాస్మోటిక్స్‌ వ్యాపారం  చేస్తున్నాడు. వ్యాపారంలో డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. ఇటీవల సొంత ఇళ్లు కూడా కొన్నాడు. ఇక బంధువులు, కుటుంబం బలం కూడా అతడికి బాగానే ఉంది. అలా హాయిగా జీవిస్తున్న అతడికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు.

పెళ్లి చూపుల కోసం అమ్మాయి తరపు వారు రావడం అజీమ్‌ను చూసి ఇంటికి వెళ్లి ఫోన్‌ చేస్తామని చెప్పడం. అయితే వారి నుంచి ఎప్పటికి సమాధానం రాకపోవడం. ప్రతి పెళ్లి చూపులకు అదే జరుగుతోంది. ఇలా అజీమ్‌కు 21ఏళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట కుటుంబ సభ్యులు. కానీ ఒక్క సబంధం కూడా సెట్‌ అవ్వడం లేదు. ఇదంతా వింటుంటే మీకు కమల్‌ హాసన్‌ ‘విచిత్ర సోదరులు’ మూవీ గుర్తుకు వస్తోంది కదా. అవును అచ్చం అలాంటిదే అజీమ్‌ కూడా జరుగుతోంది. ఈ మూవీ కమల్‌ హాసన్‌ మాదిగి అజీమ్‌ కూడా మరుగుజ్జు. చిన్నప్పుడు స్నేహితుల కామెంట్స్ భరించలేక ఐదో తరగతి వరకే చదువు ఆపేశాడు అజీమ్‌. ఆ తర్వాత కాస్మోటిక్‌ వ్యాపారం చేసుకుంటున్న అతడికి వచ్చిన పెళ్లి సబంధాలన్ని తప్పిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

దీంతో సీఎం యోగి అదిత్యనాథ్‌ను పెళ్లి చేసి పెట్టమని లేఖ కూడా రాశాడు. ఇందులో ‘నేను చాలా కాలంగా పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నా. ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. నా జీవితాన్ని పంచుకునే వ్యక్తి ఇక నాకు దొరకదెమోనని భయమేస్తుంటుంది. నీకు పెళ్లి అవసరమా అంటూ విమర్శిస్తు కుప్పలుగా లేఖలు రాస్తుంటారు. నాకు ఇక పెళ్లి కాదని మా తల్లిదం‍డ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ఆపేశారు. దయచేసిన మీరైనా నాకు పెళ్లి కూతురిని వెతికి పట్టి, వివాహం జరిపించండి’ అంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దీనిపై ఎటువంటి స్పందన రాకపోవడంతో బుధవారం మరోసారి పోలీసుల స్టేషన్‌కు వెళ్లడంతో మేము చేయాల్సింది చేస్తామని అతడికి పోలీసులు హామీ ఇచ్చి పంపించారట. 

చదవండి: 
భర్తపై హత్యాయత్నం కేసులో వీడిన ట్విస్ట్
మాస్క్‌ ధరించమన్నందుకు ఉబర్‌ డ్రైవర్‌పై మహిళ దాడి
కోవిడ్‌ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి
‌‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top