2 IAF Fighter Jets Sukhoi-30, Mirage Crash in Madhya Pradesh's Morena - Sakshi
Sakshi News home page

Fighter Jets: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన రెండు యుద్ధ విమానాలు

Jan 28 2023 11:47 AM | Updated on Jan 28 2023 1:57 PM

2 IAF Fighter Jets Sukhoi 30, Mirage Crash Madhya Pradesh Morena - Sakshi

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లో భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్‌-30, మిరాజ్‌ కుప్పకూలాయి. మొరెనాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక పైలెట్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పైలెట్లు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. 

సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. శిక్షణా సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శిక్షణా విన్యాసాలు చేస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్‌ అయిన సుఖోయ్‌, మిరాజ్‌ శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement