నారాయణపేట: కేసులను రాజీ మార్గంలో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదికని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు శనివారం కోర్టు ప్రాంగణంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 12న నిర్వహించనున్న నాలుగో జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కక్షిదారులకు లోక్ అదాలత్ ద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 12న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లాలో 5,552 కేసులను పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా 23వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, సంబంధిత సిబ్బందిని అభినందించారు. రాబోయే లోక్ అదాలత్లో క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (ఎన్ఐ) యాక్ట్, ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ), సైబర్ నేరాలకు సంబంధించిన కేసులతో పాటు నాన్న్బెయిలబుల్ వారెంట్లకు సంబంధించిన (ఎనన్బీడబ్ల్యూ) కేసులను అధికసంఖ్యలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల పరిష్కార ప్రక్రియను యథావిధిగా కొనసాగించాలని తెలిపారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.


