ఊట్కూర్: మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా స్థానిక పెద్దచెరువు రిజర్వాయర్ పనులను నాణ్యతగా చేపట్టాలని ఇరిగేషన్ సీఈ సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్ అధికారుల బృందంతో కలిసి చెరువుకట్టపై ముళ్లపొదలు, పాత రివిట్‌మెంట్ తొలగించడం తదితర పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుగట్టున ఉన్న శ్మశానవాటికను పరిశీలించారు. ఏళ్లుగా ఉన్న శ్మశానవాటిక స్థలాన్ని వదిలి రిజర్వాయర్ కట్ట నిర్మించాలని పలువురు గ్రామస్తులు కోరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ కెనాల్ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌ఈ శ్రీధర్, సర్పంచ్ రేణుక భరత్, ఈఈ గోపాలచారి, డీఈ శంకర్, శివుడు, ప్రదీప్, అజీం, గ్రామస్తులు ఇబాదుర్ రహమాన్, రాములు, భీంరాజ్, తరుణ్, సమీ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు 9లో..
మట్టి రోడ్లతో నరకయాతన
మండల కేంద్రం నుంచి
సమీప గ్రామాలకు రహదారులు కరువు
బీటీ రోడ్లు నిర్మించాలని
కోరుతున్న ప్రజలు


