మత్తు కట్టడికి పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

మత్తు కట్టడికి పటిష్ట చర్యలు

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

నారాయణపేట: జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, రవాణా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో నార్కోటిక్స్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి మత్తు పదార్థాల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రజలతో పాటు విద్యార్థుల్లోనూ విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే ప్రభావాల గురించి వివరించాలన్నారు. జూనియర్‌ కళాశాలల్లోనూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెలలో జిల్లాలో 9 కన్స్యూమర్‌ కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు సమావేశంలో వివరించారు. ఎకై ్సజ్‌, పోలీసుశాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని అరికట్టాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని డీఈఓ కార్యాలయ అధికారి తెలిపారు. ప్రత్యేక క్యాంపుల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో ఎకై ్సజ్‌ అధికారి శంకర్‌, డీఐఈఓ సుదర్శన్‌రావు, ఏఎంవీఐ గౌతంరాజ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. సిద్ధప్ప, ఎస్సై గాయత్రి, డీపీఆర్వో రషీద్‌, రాజేంద్రకుమార్‌, ఎంఏఓ బాలదినకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement