ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకం తీసుకురావాలి
ధన్వాడ: ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకంతో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి వాకబు చేశారు. ఓపీ మందుల నిల్వ తదితర వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజన్‌కు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నిత్యం అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ అనూషా, ఎంపీహెచ్‌ఓ కథలప్ప తదితరులు ఉన్నారు.


