నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నారాయణపేట: ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం జిల్లా స్థాయి క్రైం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్‌స్టేషన్ల పరిధిలో పెండింగ్ కేసులు, దర్యాప్తు నాణ్యత, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, పోలీస్ అధికారులంతా బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధిత గంజాయి అక్రమరవాణా, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటిని మానిటర్ చేయాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, వాటి నివారణకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, రామ్‌లాల్, రాజేందర్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాముడు, నవీద్, భాగ్యలక్ష్మీరెడ్డి, అశోక్‌బాబు, రాజు, విజయ్‌కుమార్, బాలరాజు, రమేష్, రాము, రాజశేఖర్, రమే ష్, పురుషోత్తం, నరేష్, సునీత, సురేష్, విజయ్ భాస్కర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు రివార్డ్ అందజేత
జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అడ్డుకుంటూ.. గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులను జైలుకు పంపిన మక్తల్ సర్కిల్, టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారులు సిబ్బందిని ఎస్పీ డాక్టర్ వినీత్ అభినందించి రివార్డు అందజేశారు. రివార్డు అందుకున్న వారిలో మక్తల్ సీఐ రాంలాల్, ఎస్‌ఐలు పురుషోత్తం, నవీద్, హెడ్ కానిస్టేబుల్ గోప్యనాయక్, పీసీలు రాఘవేందర్, రామస్వామి, అశోక్‌కుమార్, శ్రీకాంత్, భాను ఉన్నారు.


