నందికొట్కూరు: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దార సుధీర్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మిడుతూరు మండల పరిధిలోని పీర్సాహెబ్పేట గ్రామంలో టీడీపీకి చెందిన 10 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి డాక్టర్ దార, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీ కండువాలు వేసి సాదారంగా ఆహ్వానించారు. సర్పంచ్ అభ్యర్థి పాపిరెడ్డి, వైష్ణవిని గెలిపించాలని వారు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులకు ఓట్లేసి సర్పంచ్‌లుగా గెలిపించాలన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థను జగనన్న తీసుకొచ్చారని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు ప్రతి ఓటరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


