నంద్యాల(అర్బన్): నంద్యాల జిల్లాలో ఎప్పటి నుంచో మత సామరస్యం వెల్లివిరుస్తోందని కలెక్టర్ రాజకుమారి అన్నా రు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకు ని ఆదివారం మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం మున్సిపల్ టౌన్‌హాల్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబిహా పర్వీన్‌తో కలసి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లింల కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ముస్లింలు ఉపవాస దీక్షలు, సేవా భావం సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ఈ పవిత్ర మాసం మనుషుల్లో పరస్పర ప్రేమ, దయ, దాతృత్వ భావాలను పెంపొందించే సమయమన్నా రు. అనంతరం ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ముస్లింలతో కలిసి కలెక్టర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.


