వస్తువుల కొనుగోలులో అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

వస్తువుల కొనుగోలులో అప్రమత్తత అవసరం

Mar 16 2026 7:26 AM | Updated on Mar 16 2026 7:26 AM

నంద్యాల(వ్యవసాయం): వివిధ వస్తువుల కొనుగోలు సమయంలో వినియోగదారులకు అప్రమత్తత అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రవిబాబు అన్నారు. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్‌బాషా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన ఐఎస్‌ఐ మార్కు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అగ్‌మార్క్‌, హాల్‌మార్క్‌ వస్తువులనే కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించారు. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత ధర ప్రామాణికాన్ని కచ్చితంగా పరిశీలించాలన్నారు. జిల్లా తునికలకొలతల కంట్రోల్‌ షేక్‌ జిలానీ బాషా మాట్లాడుతూ.. ప్యాకేజీ, కమాండిటిస్‌ నిబంధనలు పాటించాలని, తయారీ తేదీ, ఎక్‌ప్రైరీ తేదీ, కస్టమర్‌ కేర్‌ నంబర్లను చూసి కొనుగోలు చేయాలని కోరారు. తినే ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తమై ఉండాలన్నారు. కార్యక్రమంలో ఫుడ్‌ సేఫ్టీ అధి కారి వెంకటరాముడు, వినియోగదారులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement