అగ్నిపూలు విరబూసి.. అందాలు వికసించి! | - | Sakshi
Sakshi News home page

అగ్నిపూలు విరబూసి.. అందాలు వికసించి!

Mar 10 2026 1:24 PM | Updated on Mar 10 2026 1:24 PM

శిశిర రుతువు రాకతో మరో వసంతానికి స్వాగతం పలుకుతూ ఆకుల వలువలను నేలరాల్చి నిలుచున్న వృక్షాలు నల్లమలలో పసిపిల్లలను తలపిస్తుంటాయి. అలాంటి చెట్ల సమూహంలో మోదుగ చెట్లు మరింత విశిష్టంగా కనిపిస్తాయి. ఆకులన్నీ రాలిన మోదుగ చెట్లు ఆకుల స్థానంలో ఎర్రటి మొగ్గలు పూస్తాయి. అవి విచ్చుకుని అడవి తల్లికి కొత్త అందాలను అద్దుతాయి. అందుకే వీటిని అగ్ని పూలు అని, మంకెన పూలు అని పిలుస్తూ కవితలు రాస్తుంటారు. ఆంగ్లంలో ఈ పూలను ఫ్లేమ్‌ ఆఫ్‌ది ఫారెస్ట్‌గా పిలుస్తారు. జనవరి చివరి వారం నుంచి మోదుగ పూలు పూస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. నల్లమల వ్యాప్తంగా మోదుగ పూలు విస్తారంగా కనపడుతున్నాయి. తొలకరి పలకరించే వేల మోదుగ మోడులు చిగురులు తొడుగుతాయి. – ఆత్మకూరు రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement