కదలని ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

కదలని ఆర్టీసీ బస్సు

Mar 10 2026 1:24 PM | Updated on Mar 10 2026 1:24 PM

దలని ఆర్టీసీ బస్సును డ్రైవర్లు, కండక్టర్లు నెట్టుతున్న ఈ దృశ్యం సోమవారం కోసిగి ఆర్టీసీ బస్టాండ్‌లో కనిపించింది. కోసిగి నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఎక్కి కూర్చున్నారు. అయితే బస్సు ఎంతసేపటికీ స్టార్ట్‌ కాకపోవడంతో కండక్టర్‌, మరో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు వెనుక నుంచి తోయాల్సి వచ్చింది. ఇలాంటి బస్సులు కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలో కూడా నిలిచి పోతున్నాయని, కండీషన్‌లో ఉండేవి నడపాలని ప్రయాణికులు కోరారు.

– కోసిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement