ఆళ్లగడ్డ (చాగలమర్రి): వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలోనే సంక్షేమ పథకాల పండుగ కొనసాగిందని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పథకాలను కొనసాగించి పేదలను ఆదుకున్నారన్నారు. చంద్రబాబునాయు డు ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందన్నా రు. శిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు షేక్ శంషాద్‌బీతో పాటు కొంతమంది వార్డు సభ్యులు, సుమారు 36 కుటుంబాలకు చెందిన 200 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 20 నెలల్లో రూ. 3.18 లక్షల కోట్లు అప్పు చేసినా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రీయింబర్స్‌మెంటు బకాయిలను ఎగ్గొంటేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ. 1,500 ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మొహం చాటేశారన్నారు. నిరుద్యోగ భృతి కోసం యువత ఆందోళనలు చేస్తున్నా పాలకులకు కనిపించడం లేదన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టడం దారుణమన్నారు. రెండేళ్లకే టీడీపీ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారన్నారు. మహదేవపురం ఎంపీటీసీ సభ్యురాలు వెంట షేక్ శంషాద్‌బీ, కార్యకర్తలు అబ్దుల్, ఖాదర్, గూడ పోగుల సాలయ్య, శంకర్, వెంకటరమణ, షేక్ మహబూబ్‌బాషా, లింగమయ్య, రవి, బొల్లవరం అబ్దుల్లాతో పాటు సుమారు 200 మంది వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ సలాం, శిరివెళ్ల ఎంపీపీ వసీం, మండల పార్టీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ నరహరి, మహదేవపురం నాయకురాలు జయమ్మ, నాయకులు రాజేశ్‌గౌడ్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
20 నెలల చంద్రబాబు పాలనలో
ప్రజలకు ఒరిగింది శూన్యం
అప్పులు చేసినా సూపర్ సిక్స్
అమలు చేయలేదు
మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి


