నంద్యాల | - | Sakshi
Sakshi News home page

నంద్యాల

Mar 8 2026 7:36 AM | Updated on Mar 8 2026 7:36 AM

హదీస్‌ వెలుగు :

న్యూస్‌రీల్‌

అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చారు. ప్రజలు కష్టంలో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇతోధికంగా ఆదుకుంటామని వాగ్దానం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. ఇప్పటి వరకు జలదుర్గాన్ని మండలంగా ప్రకటించలేదు. గుండాల రిజర్వాయర్‌ను నిర్మించలేదు. మైనింగ్‌ కళాశాల ఏర్పాటు కలగా మారింది. హంద్రీ–నీవా నీటితో చెరువులు నింపలేదు. కష్టాలు చూసి‘నారా’.. ఇదేనా పాలన అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026

చాడీలు చెప్పడం, ఇద్దరి మధ్య గిల్లలు పెట్టి వారిని దూరం చేయడం, బంధువుల మధ్య సంబంధాలు తెంచడం చాలా పాపం. ఇలాంటి వా టి పట్ల దూరంగా ఉండండి. – పవిత్ర ఖురాన్‌

డోన్‌: ప్రతి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని కొందరు ప్రకటిస్తున్నారు. దీంతో ఈ నెల 9న మాధవరం గ్రామంలో నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని మార్చారు. జలదుర్గం మండల కేంద్రం చేయకపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు నిలదీస్తారనే భయంతో పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని డోన్‌ నియోజకవర్గ శివారులోని కొత్తబురుజు గ్రామానికి మార్చాల్సి వచ్చిందని అధికార పార్టీ నాయకులే వెల్లడిస్తున్నారు.

బుట్టదాఖలు!

ప్యాపిలి మండలంలోని జలదుర్గాన్ని మరో మండలంగా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. జలదుర్గం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా అమలు కాలేదు. సుమారు 10వేల గ్రామ జనాభా, 25 గ్రామాలకు అనుకూలంగా ఉన్న జలదుర్గాన్ని మండల కేంద్రంగా ఎప్పుడు ఏర్పాటు చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి 20 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాపిలికి వెళ్లాల్సి వస్తోందని బూరుగల, బోంచెరువుపల్లె, సీతమ్మతండా, రాచర్ల, అలేబాద్‌తండా, మునిమడుగు, బోంచెరువుపల్లె తండా, కొమ్మేమర్రి, సిద్దనగట్టు, గార్లదిన్నె, ఊటకొండ, హుసేనాపురం, యజ్ఞరాామాపురం, కౌలపల్లె గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

చెరువులను నింపడంలో నిర్లక్ష్యం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డోన్‌ నియోజకవర్గంలోని 50 చెరువులను కోట్లాది రూపాయలతో ఆధునికీకరించారు. ఈ చెరువుల పటిష్ట తర్వాత హంద్రీ–నీవా నీటితో చెరువులను నింపి ప్రజలకు అందించారు. అనేక మంది రైతులు చెరువుల కింద వరి పంట పండించారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది. గతేడాది సగం ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేదు. చెరువులకు నీరిచ్చేందుకు చేపట్టిన పథకం నిర్వహణకు నిధులు కేటాయించ లేదు. చెరువులను నింపడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. దీంతో వేసవిలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొననున్నాయి.

మూతపడిన మైనింగ్‌

చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామిక వ్యతిరేక విధానాలతో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్న డోన్‌ నియోజకవర్గంలో మైనింగ్‌ కార్యకలాపాలు కుంటుపడ్డాయి. సెస్సు, రాయల్టీ, డెవిడెంట్ల్లు లాంటి పన్నులను విపరీతంగా పెంచడంతో పారిశ్రామిక వృద్ధి కుప్పకూలిపోయింది. గతంలో చంద్రబాబు ఇచ్చిన మైనింగ్‌ కళాశాల ఏర్పాటు హామీ అటకెక్కింది. నాపరాతి గనులు, ఇతర క్వారీల మీద 40 వేలకు పైగానే కార్మిక కుటుంబాలు ఆధారపడ్డాయి. పన్నులను విపరీతంగా పెంచడంతో వీరి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనుంది.

నీటి మీద రాత

డోన్‌ నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లా నుంచి విడదీసి తిరిగి కర్నూలు జిల్లాలో విలీనం చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే గత ఐదు నెలల క్రితం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాలు, మండలాలను విలీనం చేయడం, విడగొట్టడం చేశారు. అయితే డోన్‌ ప్రజలకు ఇచ్చిన హామీని నీటి మీద రాతగా మార్చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హామీలను అటకెక్కించిన

సీఎం చంద్రబాబు

మండిపడుతున్న ప్రజలు

కర్నూలు జిల్లాలో డోన్‌ విలీనం

ఉత్తిమాటేనా?

అటకెక్కిన జలదుర్గం మండలం

వాగ్దానం

కలగా మిగిలిన

మైనింగ్‌ కళాశాల ఏర్పాటు

హంద్రీ–నీవా నీటితో నిండని చెరువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement