అహోబిలేశుని తెప్పోత్సవం.. భక్తిపారవశ్యం | - | Sakshi
Sakshi News home page

అహోబిలేశుని తెప్పోత్సవం.. భక్తిపారవశ్యం

Mar 8 2026 7:36 AM | Updated on Mar 8 2026 7:36 AM

శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం చివరిరోజు శనివారం రాత్రి కన్నులపండుగలా సాగింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరద స్వాములను పల్లకీ పై కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగింపుగా కోనేటి వరకు తోడ్కొని వచ్చారు. ఉభయ దేవేరులతో స్వామి తెప్పను అధిరోహించిన అనంతరం వేదపండితుల పూజలు అందుకున్నారు. సుమారు గంటపాటు తెప్పోత్సవం జరిగింది. నారసింహ స్వామి కీర్తనలు భక్తి పారవశ్యంతో ఆలపిస్తుండగా, చల్లని వేళ భక్తుల నుంచి హారతులు అందుకుంటూ ప్రహ్లాదవరదస్వామి ఉభయ దేవేరులతో తెప్పపై ఊరేగారు. కోనేటి చుట్టూ భక్తులు చేరుకుని కార్యక్రమాన్ని వీక్షించి ఆశీస్సులు అందుకున్నారు. – ఆళ్లగడ్డ

పుష్కరిణిలో

మిరమిట్లు గొలిపే

వెలుగుల్లో

ప్రహ్లాదవరదుడి

తెప్పోత్సం

తెప్పోత్సవంలో కొలువైన ఉత్సవమూర్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement