మాయమాటలతో టీడీపీ నేతలు మోసగించారని రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు అర్థమైంది. సూపర్ సిక్స్ హామీలంటూ గత వైఎస్సార్‌సీపీ అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చారు. సామాన్య పేద ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు.
– తిరుమలరెడ్డి,
సింగిల్‌విండో మాజీ చైర్మన్, తిరునాంపల్లె
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూరిస్థాయిలో అమలు కాలేదు. డోన్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ ప్రాంతంలో పర్యటనకు రావడం సిగ్గుచేటు. టీడీపీ నేతల మాటలను ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదు.
– రేగటి రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ, డోన్
నమ్మిన ప్రజలను పదేపదే వంచించడం దారుణం. నిత్యం కరువు కాటకాలతో అల్లాడిపోయే ఈ ప్రాంతం ప్రజల చిరకాల వాంఛ అయిన చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపట్టకపోవడం దౌర్భాగ్యం. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
– రామాంజనేయులు,
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డోన్
పరిపాలనా సౌలభ్యం కోసం జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు.రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కొత్త మండలాలు ఏర్పాటు చేసినా జలదుర్గం మండలం ఊసే లేకపోవడం బాధ కలిగించింది. చంద్రబాబు మాయమాటలకు జలదుర్గం గ్రామ ప్రజలు మోసపోయారు. – రసూల్, ఆవాజ్‌కమిటీ చైర్మన్,
జలదుర్గం గ్రామం
●


