నాకు ఇరువురు సంతానం. బిడ్డతో సహా ఇక్కడే నివసిస్తున్నాం. ఇల్లు పోతుందన్న బాధతో ఇటీవల పెరాలసిస్ సోకింది. మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. కూతురు ఫ్యాక్టరీల పనులకు వెళితే ఇంటి బయట గేటుకు తాళం వేసి వెళుతుంది. ఆమె వచ్చిన తర్వాతే నాకు సపర్యలు చేస్తుంది. రేషన్ బియ్యం తెచ్చుకొని వండుకొని తినాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ సమీపంలో సెంటు స్థలం ఇచ్చారు. అప్పోసప్పో తెచ్చుకొని లెంటల్ వరకు ఇంటిని నిర్మించుకున్నాం. ఉన్న ఫలంగా సెంటు స్థలంతో పాటు కట్టించిన ఇల్లు కాకుండా రెండు సెంట్ల స్థలం ఇస్తామంటూ ఇటీవల సంతకాలు చేయించుకున్నారు. రెండు సెంట్ల స్థలం మాకు వద్దు.. జగనన్న ఇచ్చిన సెంటు స్థలంలోనే ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటాం. – మహమ్మద్


