కర్నూలు: ఇటీవల విడుదలైన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఎకై ్సజ్ శాఖ జోన్–4 (కర్నూలు జోన్) కింద ఎంపికై న 42 మంది అభ్యర్థులకు గాను శుక్రవారం 20 మంది అభ్యర్థులకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కర్నూలు నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.హనుమంతరావు ఆధ్వర్యంలో ఆరోగ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక డీసీ కార్యాలయంలో 20 మంది అభ్యర్థులకు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జావేద్ బృందం నేతృత్వంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మిగిలిన 22 మంది అభ్యర్థులకు శనివారం దేహదారుఢ్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఏఈఎస్‌లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


