గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి మా కుటుంబానికి విలువైన సెంటు స్థలాన్ని ఇచ్చారు. ఎంతో కొంత మొత్తంతో ఇంటి నిర్మాణం చేపట్టుకున్నాం. కొడుకు అల్లబకాష్ కూలీకి వెళ్లి తెచ్చే డబ్బులతో కుటుంబ పోషణ జరుగుతుంది. తాను ఎక్కడికి కదల్లేని పరిస్థితి. ఉన్నఫలంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ ఇటీవల అధికారులు తమతో సంతకాలు చేయించుకున్నారు. రెండు సెంట్ల స్థలం ఎక్కడ ఇచ్చేది చెప్పకుండా అధికారులు దాగుడు మూతలాట ఆడుతున్నారు. గతంలో ఎంతో మంది నాయకులు ఇంటి పట్టాలు ఇస్తున్నామంటూ బూటకపు మాటలు చెప్పారే కాని ఒక్క శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి మాత్రమే ఇంటి స్థలం ఇచ్చి ఆదుకున్నారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి అధికారులు సహకరిస్తే సంతోషిస్తాం.
–ఖాదర్‌బీ, బాధితురాలు


