కర్నూలు సిటీ: క్వాంటం టెక్నాలజీ అత్యంత వేగంగా సమస్యలను పరిష్కారం చేస్తుందని ప్రొఫెసర్లు అన్నారు. జగన్నాథగట్టులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ట్రిబుల్‌ఐటీడీఎం)లో క్వాంటం మెటీరియల్స్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్ అనే అంశంపై శుక్రవారం వర్క్‌షాపు ప్రారంభం అయ్యింది. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వర్క్‌షాపును ట్రిబుల్‌ఐటీడీఎం రిజిస్ట్రార్ జె.క్రిష్ణయ్య, ఆన్‌లైన్‌లో ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ బి.కోటేశ్వరరావులు ప్రారంభించి ప్రసంగించారు. క్వాంటం టెక్నాలజీ డేటాను అత్యంత వేగంగా విశ్లేషణ చేస్తుందన్నారు. అనంతరం వర్క్‌షాపు కో–ఆర్డినేటర్ డా.పవన్ ప్రకాష్ మాధురీ మాట్లాడారు. ట్రిబుల్‌ఐటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


