
తెలుగు దేశం ప్రభుత్వంలో కరెంటు బిల్లు కట్టలేదని కనెక్షన్ కట్ చేశారు. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉన్న మా ఇంట్లో 50 యూనిట్లు వాడే అవకాశం లేదు. అన్యాయంగా బకాయిలు చూపించి వందలాది రూపాయలు బిల్లు చూపించి కట్టలేదని కరెంటు తొలగించారు. సీఎం వైఎస్ జగనన్న మాకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇస్తునట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయం.
– శిఖామణి ఆత్మకూరు పట్టణం
సీఎస్‌ఐ పాలెం
పైసా కట్టలేదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దళితులకు 200 యూనిట్లు పథకం ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పైసా కూడా కరెంట్ బిల్లు కట్టలేదు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మాకు ఉచిత కరెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్నారు. ఉచిత కరెంట్ ఇచ్చిన జగనన్నకు రుణపడి ఉంటాం.
– గరక మధన్ గుమ్మకొండ గ్రామం,
డోన్ మండలం
ఉచిత విద్యుత్‌పై
అవగాహన కల్పించాం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 200 లోపు విద్యుత్ వాడితో జీరో బిల్. ఆపై వాడితే చెల్లించాలని అవగాహన కల్పించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యతతో అందించేందుకు ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో కావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాట్లు చేశాం.
– ఎం. ఉమాపతి, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
●

