కొను‘గోడు’పట్టదా..? | - | Sakshi
Sakshi News home page

కొను‘గోడు’పట్టదా..?

May 21 2025 1:45 AM | Updated on May 21 2025 1:45 AM

కొను‘

కొను‘గోడు’పట్టదా..?

● ఐదు రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద ఆగిన జొన్నల లారీలు, ట్రాక్టర్లు ● రోజుల తరబడి నిరీక్షిస్తున్న రైతులు ● పట్టించుకోని పాలకులు, అధికారులు ● ఆందోళనలో జొన్న రైతులు

ఆళ్లగడ్డ: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతన్న ఆపసోపాలు పడుతున్నాడు. కొను గోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఐదురోజులుగా జొన్న రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఓ వైపు వరుణుడు ఉరుముతుండగా.. మరో వైపు వాహనాల అద్దె భయపెడుతుండగా జొన్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం జొన్నలు మద్ధతు ధర రూ. 3,371తో కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నంద్యాలలో కొనుగోలు కేంద్రం నిండిపోవడంతో అధికారుల సూచన మేరకు రైతులు తమ జొన్నలను లారీలు, ట్రాక్టర్లతో తీసుకుని ఆళ్లగడ్డ కొనుగోలు కేంద్రానికి చేరుకుంటున్నారు. అయితే ఐదు రోజులుగా వచ్చిన రైతులకు ట్రక్‌ సీట్‌ ఇస్తున్నారే తప్ప అన్‌లోడ్‌ చేసే వారు లేక పోవడంతో రైతులు రాత్రి పగలు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సుమారు 100 మంది దాక రైతులు, డ్రైవర్లు అందరు మార్కెట్‌ యార్డులోనే ఉంటున్నామని అయినా ఎపుడు దించుకుంటారో, అస్సలు దించుకుంటారో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సిబ్బందిని అడిగితే ‘ట్రక్‌ సీట్‌ ఇచ్చేవరకే మాకు సంబంధం.. దించుకుంటారో లేదా అన్నది కొనుగోలు కేంద్రంలో ఉన్నవారు చూసుకోవాలి అని సమాధానమిస్తున్నారు. అక్కడ మాత్రం సమాధానం ఇచ్చే వారు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్య ఏమిటో తెలియకపోవడంతో చివరకు కొందరు రైతు లు స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియకు సమస్యను విన్నవించగా. .‘మాట్లాడుదాం మిని మహానాడు దగ్గరకు రండి చెప్పారు. ఎంతో ఆశతో అక్కడకు వెళితే పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఐదు రోజులుగా అక్కడే!

ఇక్కడ జొన్నల లోడు లారీ దగ్గర నిల్చున్న రైతు నంద్యాల మండలం కానాలకు చెందిన శివారెడ్డి. నంద్యాలలో గోడౌన్‌ ఫుల్‌ అయిందని ఆళ్లగడ్డ గోడౌన్‌కు వెళ్లమని చెప్పడంతో తన 340 సంచుల జొన్నలను లారీ బాడుగకు తీసుకుని ఆళ్లగడ్డకు వేసుకొచ్చాడు. ఐదు రోజులైనా దించుకోక పోవడంతో అక్కడే ఉంటున్నాడు. లారీ బాడుగ రూ. 18,000, ఇవ్వడంతో పాటు హాల్టింగ్‌కు రోజుకు రూ. 2 వేలు, బత్తా రూ. 100 ఇవ్వాల్సి వస్తోంది. దీంతో పాటు ఐదు రోజులుగా లోడు అలాగే ఉండటంతో లారీ టైర్లు దెబ్బతింటాయని, దానికి కూడా డబ్బులు ఇవ్వాలని డ్రైవరు భయపెడుతున్నాడు. మరోవైపు కురుస్తున్న వర్షానికి జొన్నలు తడిసిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతు శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

బాడుగ తడిసి మోపెడు..

ఇక్కడ ట్రక్‌ సీట్‌ (జొన్నలు దించుకోమని మార్క్‌ఫెడ్‌ సిబ్బంది ఇచ్చిన రసీదు) చూపుతున్న ఈ రైతు బండారు శ్రీనివాసులు. మండల కేంద్రం దొర్నిపాడుకు చెందిన ఈ రైతు తన 100 ప్యాకెట్ల జొన్నలు కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు శనివారం రాత్రి ఆళ్లగడ్డ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. వచ్చిన వెంటనే మార్క్‌ఫెడ్‌ సిబ్బంది ఆన్‌లైన్‌లో అన్నీ పరిశీలించి ట్రక్‌ సీట్‌ ఇవ్వడంతో సంతోషంతో కొనుగోలు కేంద్రం (ప్రభుత్వ మార్కెట్‌ యార్డు)కు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ బారులుదీరి నిలుచున్న వాహనాలను చూసి ఏమైంది?.. అని ఆరా తీయడంతో తన కంటే ముందు నుంచే ఇక్కడ ఉన్నామని దించుకునే నాథుడే లేడని చెప్పడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. రోజుకు రూ. 3 వేలు ట్రాక్టర్‌ బాడుగతో పాటు ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

కొను‘గోడు’పట్టదా..? 1
1/4

కొను‘గోడు’పట్టదా..?

కొను‘గోడు’పట్టదా..? 2
2/4

కొను‘గోడు’పట్టదా..?

కొను‘గోడు’పట్టదా..? 3
3/4

కొను‘గోడు’పట్టదా..?

కొను‘గోడు’పట్టదా..? 4
4/4

కొను‘గోడు’పట్టదా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement