
రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి అన్నదాతకు అడుగడుగునా సా
● అన్నదాత సుఖీభవపై కూటమి సర్కారు ప్రకటనలకే పరిమితం ● రూ. 20 వేల సాయం మొదటి సంవత్సరం ఉత్తిదే! ● మళ్లీ పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం ● ఈ ఏడాదైనా భరోసా దక్కేనానని అనుమానం
సాగుకు పొలాన్ని సిద్ధం
చేస్తున్న రైతు
వైఎస్సార్‌సీపీ పాలనలో ఇలా..
కోవెలకుంట్ల: పంటల సాగుకు ఏటా పెట్టుబడి పెరిగిపోతుంది. విత్తనం, సేద్యం, రసాయన ఎరవులు, పురుగు మందులు, కూలీలు.. ఇలా ఎన్నో ఖర్చులు. పెట్టుబడికి అప్పులు చేయడం, పంటలు చేతికందక నష్టపోవడం రైతులకు పరిపాటిగా మారింది. అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరిస్తోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 2.51 లక్షల మంది రైతులు ఉన్నారు. ముందస్తు వర్షాలు ఆశాజనకంగా మారటంతో ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. గతేడాది వరి, మిరప సాగుతో తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులు ఆ నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. వరిసాగులో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడులు మాత్రమే రావడం, బస్తా రూ. 12 వందలు కూడా ధరలేకపోవడంతో నష్టపోయారు. మిరపలో ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోవడం, క్వింటా రూ. 8 వేలు ధర పలకపోవడంతో నష్టాల ఊబిలో కూరక పోయారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రూ. 20 వేలు ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర లేదు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో అధిక విస్తీర్ణంలో పప్పుశనగ పంట సాగు చేయగా వర్షాభావం, తెగుళ్లు వెంటాడి దిగుబడులు తగ్గిపోగా మద్దతు ధర లేక పంట ఉత్పత్తులను ఇప్పటి వరకు గోదాముల్లో భద్రపరుచుకున్నారు. రెండు సీజన్లలో పంటలు నష్టపోయినా ప్రభుత్వసాయం దక్కలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. రబీసీజన్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడంతో జిల్లాలోని బనగానపల్లె, సంజామల, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, బేతంచెర్లను కరువు మండలాలుగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ మండలాలకు ఎలాంటి కరువు సాయం అందలేదు.
కేంద్రబృందం పర్యటించినా
అందని సాయం..
2023–24 సంవత్సరంలో రబీ సీజన్‌లో ఆయా వర్షాభావ పరిస్థితుల్లో 38,801 హెక్టార్లలో శనగ, జొన్న, మినుము, కంది, మొక్కజొన్న, తదితర 16 రకాల పంటలు దెబ్బతిన్నట్లు అప్పట్లో అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాకు నష్టపరిహారం కింద రూ. 37.76 కోట్ల అవసరమవుతాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్రబృందం గత ఏడాది జూన్ నెల 20వ తేదీన జిల్లాలో పర్యటించింది. కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులతో సాగు చేసిన పంటల్లో తీవ్ర నష్టం వాటిల్లి పెట్టుబడులు నేలపాలయ్యాయని రైతులు కేంద్రబృ ందం ఎదుట ఏకరువు పెట్టారు. శనగ, జొన్న, మినుము, కంది, మొక్కజొన్న, తదితర పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. వర్షాభావంతో రైతులకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, నివేదికలను ప్రభుత్వానికి పంపంచి అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రబృందం హామీ ఇచ్చింది. జిల్లాలో కేంద్రబృందం పర్యటించి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు పంటనష్ట పరిహారం ఊసే లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఐదేళ్లలో రైతు భరోసా సాయం వివరాలు
సంవత్సరం రైతులసంఖ్య అందిన సాయం
(లక్షల్లో) (రూ. కోట్లలో)
2019-20 2.09 283.31
2020-21 2.15 291.51
2021-22 2.15 291.05
2022-23 2.21 298.67
2023-24 2.19 220.97
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండుగలా సాగింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులను అన్నివిధాలా ఆదుకున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల సాగుకు పెట్టుబడుల కోసం వడ్డీవ్యాపారులను ఆశ్రయించకుండా ప్రతి ఏటా పీఎం కిసాన్ నిధితో కలిపి వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ. 13,500 అందించారు. విత్తనానికి ముందే పెట్టుబడిసాయం అందటంతో రైతులు విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహార మందులు కొనుగోలు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసి ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించారు. గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు, క్రిమి సంహారక మందులు సరఫరా చేసి రైతన్నకు దన్నుగా నిలిచారు. పంటకు ముందే మద్దతు ధర ప్రకటించి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేని సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం సంభవిస్తే అదే సీజన్‌లో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకున్నారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి అన్నదాతకు అడుగడుగునా సా

రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి అన్నదాతకు అడుగడుగునా సా