ఎకరాకు రూ. 12,500 కౌలు చెల్లించి ఎనిమిది ఎకరాల్లో రబీ సీజన్‌లో వరి సాగు చేశాను. పైరు పొట్టదశలో కుందరవాగుకు సాగునీరు నిలిచిపోయింది. ఎన్నో కష్టాలు పడి సాగునీరు మళ్లించుకున్నాను. ఎరువులు, పురుగు మందులు, కోత, నూర్పిడి, సాగునీరు మళ్లింపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 35 వేల నుంచి 40 వేలు పెట్టాను. పెట్టుబడులు భారీగా పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి.
– ప్రతాప్‌రెడ్డి, రైతు, భీమునిపాడు,
కోవెలకుంట్ల మండలం
పెట్టుబడుల కోసం అప్పులు చేశాను
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విత్తనానికి ముందే రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ. 13,500 సాయమందేది. ఆ మొత్తంతో విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ఎలాంటి డోకా ఉండేదికాదు. గత ఏడాది నుంచి పెట్టుబడి సాయం అందలేదు. రబీ సీజన్‌లో జొన్న, శనగ పంటలు సాగు చేశాను. పెట్టుబడికోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది.
– రామసుబ్బరాయుడు, రైతు, జోళదరాశి,
కోవెలకుంట్ల మండలం
ఈ ఏడాదైనా
పెట్టుబడిసాయం ఇవ్వాలి
ఈ ఏడాది నాకున్న మూడున్నర ఎకరాల పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప, మొక్కజొన్న పంటలు సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నాను. గత ఖరీఫ్, రబీసీజన్లలో పెట్టుబడిసాయం అందలేదు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఖరీఫ్‌సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాదైనా పెట్టుబడిసాయం అందించి ఆదుకోవాలి. – కుళాయప్ప, రైతు,
అమడాల, కోవెలకుంట్ల మండలం
●
దిగుబడులు అంతంతగానే
దిగుబడులు అంతంతగానే