ఇష్టానుసారంగా సిట్టింగ్‌ల నిర్వహణ
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల యాజమాన్యాలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నాయి. నగర పరిధిలో సిట్టింగ్ అనుమతులు కలుపుకుని సుమారు 50 మద్యం దుకాణాల వరకు ఉంటాయి. ఇవి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తుండటంతో మున్సిపల్ కార్పొరేషన్ భారీగా ఆదాయం కోల్పోతోంది. నిబంధనల ప్రకారం నగరంలో ఎలాంటి వ్యాపారం నిర్వహించాలన్నా ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. కానీ నీలగిరి నగరంలోని మద్యం దుకాణాదారులు అవేమీ పట్టించుకోకపోవడంతో కార్పొరేషన్ ఖజానాకు గండి పడుతోంది.
అధికారుల పర్యవేక్షణ కరువు
అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కింది స్థాయి ఉద్యోగులు మద్యం దుకాణాల నిర్వాహకులకు ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేయకపోవడంతో లైసెన్స్‌లు లేకుండానే వ్యాపారం సాగిపోతోంది. దుకాణం ఏర్పాటు చేయగానే లైసెన్స్ జారీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్‌కు ఖర్చులు పెరుగుతున్నా.. ఉన్న ఆదాయ వనరులను రాబట్టుకోవడంలో అధికారులకు చిత్తశుద్ధి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ట్రేడ్ లైసెన్స్‌ల జారీపై దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
మద్యం దుకాణాల వెనుక, పక్కన ఏర్పాటు చేసిన సిట్టింగ్‌ల నిర్వహణ అధ్వానంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచకపోవడంతో చుట్టుపక్కల నివాసాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తాచెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం, శుభ్రం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల దోమలు ఉధృతి పెరుగుతోంది. ఫలితంగా సమీప కాలనీల ప్రజలకు డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు సోకే ప్రమాదం పొంచి ఉంది.
ఫ కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండానే మద్యం దుకాణాల నిర్వహణ
ఫ లక్షల రూపాయల ఆదాయానికి గండి
ఫ ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్ల అధిక ధరల దోపిడీపైనా అధికారుల నిఘా కరువు


