నాటుసారాపై ఎకై ్సజ్‌ సమరం | - | Sakshi
Sakshi News home page

నాటుసారాపై ఎకై ్సజ్‌ సమరం

Nov 27 2026 1:56 AM | Updated on Nov 27 2026 1:56 AM

ఈ ఏడాది 1,434 కేసులు

నాటుసారా తయారీ, విక్రయాలపై ఎకై ్సజ్‌ శాఖ నిరంతర దాడులు కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1,434 కేసులు నమోదు చేసి 11,825 మందిని అరెస్టు చేసింది. 57,719 లీటర్ల నాటుసారా, 2,63,812 కిలోల బెల్లం, 21,686 కిలోల ఆలమ్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు 9,24,360 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసింది. అక్రమ రవాణాకు వినియోగించిన 1,848 వాహనాలను సీజ్‌ చేసింది. కాగా.. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌, డీటీఎఫ్‌ బృందాలు ప్రతి నెలా ఒకట్రెండు సార్లు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి.

నల్లగొండ: నాటుసారా తయారీ కేంద్రాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా బుధవారం, గురువారం రెండు రోజుల పాటు ఎకై ్సజ్‌ శాఖ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించింది. ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ మహంతి ఆదేశాల మేరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌కు చెందిన నాలుగు స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో పాటు స్థానిక ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీటీఎఫ్‌, ఎక్సైజ్‌ స్టేషన్ల సిబ్బంది కలిపి మొత్తం 16 బృందాలుగా ఏర్పడి ఈ దాడులు నిర్వహించాయి. రెండు జిల్లాల్లోని 36 గ్రామాల్లో నాటుసారా తయారీ ప్రాంతాలను జల్లెడ పట్టాయి. ఈ తనిఖీల్లో మొత్తం 53 కేసులు నమోదు చేసి 24 మందిని అరెస్టు చేయగా, మరో 27 మందిని బైండోవర్‌ చేశారు. 115 లీటర్ల నాటుసారా, 40 కిలోల బెల్లం, 25 కిలోల ఆలమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తయారీకి సిద్ధంగా ఉంచిన 7,400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

ఫ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు రోజులు స్పెషల్‌ డ్రైవ్‌

ఫ 36 గ్రామాల్లో 16 బృందాల విస్తృత తనిఖీలు

ఫ 53 కేసులు నమోదు.. 24 మంది అరెస్టు, 27 మంది బైండోవర్‌

ఫ 7,400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement