సామాన్యుడికి ‘పప్పు’ భారం | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడికి ‘పప్పు’ భారం

Nov 27 2026 1:56 AM | Updated on Nov 27 2026 1:56 AM

పప్పులు కొనలేకపోతున్నాం రైతులకు అవగాహన కల్పిస్తాం

కంది, పెసర, మినుము పప్పుల ధరలు చూసి కొనలేకపోతున్నాం. నెల రోజుల్లోనే కిలోకు రూ.20 వరకు పెరిగింది. మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. పప్పుకు బదులు వేరే కూరలు చేసుకుంటున్నాం. – రమేష్‌, నల్లగొండ

జిల్లాలో పదేళ్లుగా కంది, పెసర, మినుము, శనగల వంటి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపడం లేదు. పప్పు పంటలపై రైతుల్లో అవగాహన కల్పించి సాగును పెంచేలా చర్యలు తీసుకుంటాం. అపరాలకు కూడా మంచి మార్కెటింగ్‌ సౌకర్యం ఉంది. రైతులు అపరాల సాగుకు మొగ్గుచూపాలి.

– వినోద్‌కుమార్‌, డీఏఓ, నల్లగొండ

నల్లగొండ టౌన్‌ : నిత్యావసరాల్లో ప్రధానమైన పప్పుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కంది, పెసర, మినుము, శనగపప్పు రేట్లు సామాన్యులను భయపెడుతున్నాయి. నెల వ్యవధిలోనే అన్ని పప్పుల ధరలు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరో వారంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లాలో పదేళ్లుగా అపరాల సాగు గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి పప్పులను దిగుమతి చేసుకోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఎలాంటి సబ్సిడీ

లేకపోవడంతో..

జిల్లాలో రైతులు కేవలం వరి, పత్తి, కూరగాయల సాగుపైనే దృష్టి సారిస్తూ అపరాల సాగుకు దూరంగా ఉంటున్నారు. వర్షాధారంగా అపరాల సాగు చేయడం వల్ల అనావృష్టితో పంటలు ఎండిపోయి నష్టాల పాలవుతున్న నేపథ్యంలో రైతులు ఆ వైపు చూడటం లేదు. దీనికితోడు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంది, పెసర, మినుము, శనగ వంటి విత్తనాలపై సబ్సిడీని ఎత్తివేసింది. అపరాల సాగుకు గత ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేని కారణంగా రైతులు పప్పు పంటల సాగును పూర్తిగా వదిలేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం ఉంటే అపరాల సాగు పెరుగుతుందని అంటున్నారు.

పప్పుల ధరలు ఇలా..

రకాలు నెల క్రితం ప్రస్తుతం

కంది 160 180

పెసర 110 140

మినుము 120 140

శనగ 70 100

ఫ నెల వ్యవధిలోనే కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగిన కంది, పెసర, మినుము, శనగపప్పు ధరలు

ఫ తగ్గుతున్న అపరాల సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement