ఎన్‌హెచ్‌ఎం మెరిట్‌ జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం మెరిట్‌ జాబితా విడుదల

Nov 27 2026 1:56 AM | Updated on Nov 27 2026 1:56 AM

నల్లగొండ (నల్లగొండ టౌన్‌): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ పోస్టులను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ రాహుల్‌ గురువారం తెలిపారు. జాబితాను www.nalgonda.telangana.gov.in వెబ్‌సైట్‌తోపాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాలో ఎంఎల్‌హెచ్‌పీ, ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, అనస్తలిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్‌, పీడియాట్రిషియన్‌, ఓబీజీ స్పెషలిస్ట్‌, పబ్లిక్‌ హెల్త్‌ మేనేజర్‌, ఇపిడెమియాలజిస్ట్‌, ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌), ఫార్మసిస్ట్‌, ఓటీ టెక్నీషియన్‌ పోస్టులు ఉన్నాయని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28 సాయంత్రం 5 గంటల్లోగా లిఖితపూర్వకంగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

ప్రతిభను ప్రోత్సహించడం

అభినందనీయం

నల్లగొండ: విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పదో తరగతి మండల స్థాయి టాపర్లకు ప్రోత్సాహక చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్‌ టెన్త్‌ క్లాస్‌– చదువుకో తెలంగాణ 2025–26 కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాలకు చెందిన 33 మంది పదో తరగతి టాపర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందజేశారు. అనంతరం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘మిషన్‌ టెన్త్‌క్లాస్‌–చదువుకో తెలంగాణ’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ సుశీందర్‌రావు, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీనియర్‌ డీజీఎం నరేందర్‌, డీఎం రాజిరెడ్డి, బ్రాంచ్‌ మేనేజర్‌ భాస్కర్‌, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ ఆలయం వద్ద

టెండర్‌ వేలం

నల్లగొండ(కనగల్‌): కనగల్‌ మండలంలోని దర్వేశిపురం( పర్వతగిరి) స్టేజీ వద్ద గల రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఏడాది కాలానికి వివిధ వస్తువిక్రయ హక్కుల కల్పనకు అధికారులు గురువారం టెండర్‌ వేలం నిర్వహించారు. కొబ్బరికాయల విక్రయ హక్కులను వలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన పిట్టల శివ రూ.85 లక్షల 10 వేలకు, పూలు పండ్లు విక్రయ హక్కులను రూ 20 లక్షలకు దక్కించుకున్నాడు. లడ్డూ, పులిహోర విక్రయ హక్కులను దామరచర్ల మండలం కల్లేపల్లికి చెందిన నెహ్రు రూ. 17 లక్షలకు దక్కించుకున్నాడు. ఫంక్షన్‌ హాల్‌, గాజులు, ఫొటోలు తీసేందుకు సరైన వేలం రానందున తాత్కాలికంగా వాయిదా వేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ భాస్కర్‌, ఇన్‌స్పెక్టర్‌ సుమతి, ఆలయ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి, ఈఓ నాగిరెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ లు ఉపేందర్‌ రెడ్డి, నాగరాజు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement