ఫాస్ట్‌ఫుడ్‌ కల్తీమయం | - | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ఫుడ్‌ కల్తీమయం

Nov 25 2026 4:00 AM | Updated on Nov 25 2026 4:00 AM

బిర్యానీ నాణ్యతపై అనుమానాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు

ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా రూ.100లకే బిర్యానీ అంటూ ప్రచార బోర్డులు కనిపిస్తున్నాయి. అదే విధంగా ప్రధాన రహదారుల వెంట సాయంత్రం సైతం ఈ బిర్యానీల ప్యాకెట్లు, పెద్దపెద్ద గిన్నెలను అక్కడే పెట్టి విక్రయాలు చేస్తున్నారు. ఆయా బిర్యానీలకు వినియోగిస్తున్న కిరాణ సామగ్రి, వంట నూనెలు, పప్పు దినుసులు తదితర వాటిపై ఎలాంటి పర్యవేక్షణ ఉండటం లేదు. ఆహార పదార్థాల్లో ఎలాంటి కల్తీ జరగకుండా చూడాల్సిన సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పెద్ద హోటల్స్‌తో పాటు రోడ్ల వెంట బిర్యానీలు విక్రయించే సెంటర్లను కూడా తనిఖీ చేసి కల్తీ నూనె, కల్తీ దినుసులు వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ ఇష్టానుసారంగా రంగులు, రసాయనాల వినియోగం

ఫ క్యాన్సర్‌, ఊబకాయం, గ్యాస్ట్రిక్‌,

అల్సర్‌ వంటి వ్యాధుల ముప్పు

పొంచి ఉందంటున్న వైద్యులు

ఫ బిర్యానీల నాణ్యత, కల్తీ నూనైపె

తనిఖీలు చేయడం లేదని విమర్శలు

నల్లగొండ టూటౌన్‌: జిల్లాలో ఆహార పదార్థాలలో రంగురంగుల రసాయనాలు వినియోగిస్తూ గుమగుమ వాసనలు వచ్చే విధంగా చేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులకు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రసాయనాలతో కూడిన రంగులను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు, పిల్లలు ఎక్కువగా ఈ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు వెళ్లి తింటుండటంతో వారు అనారోగ్యం పాలవుతున్నట్లు తెలుస్తోంది. హానికరమైన రంగులు, రసాయనాలు వినియోగించవద్దని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు చెబుతున్నా సంబంధిత వ్యాపారులు ఖాతరు చేయడం లేదనే విమర్శలున్నాయి.

200 వరకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు

జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండతో పాటు ఇతర చిన్న పట్టణాలు, మండలాల్లో సైతం ఈ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు 200 వరకు ఉన్నట్లు తెలిసింది. ఆయా సెంటర్ల నిర్వాహకులు అధిక మోతాదులో రసాయనాలు వినియోగించడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్‌, ఉబకాయం, గ్యాస్ట్రిక్‌, అల్సర్‌, కడుపు మంట లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అదే విధంగా ఈ సెంటర్లలోనే పలు రకాల బిర్యానీలలో కూడా రంగుల మయం చూపిస్తూ.. గుమగుమ వాసనలకు ప్రధాన కారణం వాటి వెనుక ఉపయోగించే హానికరమైన రసాయనాలే కారణమనే చర్చ నడుస్తోంది.

ఆహార పదార్థాలను కల్తీ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఫాస్ట్‌ఫుడ్‌లో రంగులు కలిపినా, రసాయన పదార్థాలు కలిపినట్లు తేలినా కేసులు నమోదు చేస్తాం.

– జ్యోతిర్మయి, జోనల్‌ అసిస్టెంట్‌ కంట్రోలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement