నల్లగొండ (నల్లగొండ టూటౌన్) : పట్టణంలోని చర్లపల్లి విపస్య స్కూల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్ శిక్షణ శిబిరాన్ని మంగళవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీల కోసం బాలికలకు 18 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్ మాట్లాడుతూ.. శిబిరంలో పాల్గొనే క్రీడాకారిణులకు ఉచిత భోజన, వసతి కల్పించినట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బొజ్జ శంకర్, దాసరి సాయి, ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, రాఖీ, అశోక్ ముదిరాజ్, కోచ్ సంజయ్ పాల్గొన్నారు.


