వెల్‌నెస్‌ సెంటర్‌లో మందుల కొరత | - | Sakshi
Sakshi News home page

వెల్‌నెస్‌ సెంటర్‌లో మందుల కొరత

Nov 25 2026 4:00 AM | Updated on Nov 25 2026 4:00 AM

నల్లగొండ టౌన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని వెల్‌నెస్‌ సెంటర్‌లో మందుల కొరత తీవ్రంగా ఉంది. పది నెలలుగా పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్‌లోని సగం మందులు కూడా ఇవ్వడం లేదు. కనీసం బీపీ, షుగర్‌, జ్వరం, జలుబు, ఇతర దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన మందులు కూడా అందుబాటులో లేవు. గతంలో వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్వహణ ఆరోగ్యశ్రీ ట్రస్టు చేపట్టగా ప్రస్తుతం ఏడాది కాలంగా డీఎంఈ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి మందులు పూర్తిస్థాయిలో రావడం లేదు.

మెడికల్‌ షాపులే దిక్కు..

నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన హెల్త్‌కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు నల్లగొండలోని జీజీహెచ్‌లో గల వెల్‌నెస్‌ సెంటర్‌కు రోజూ వంద మంది వరకు వస్తుంటారు. ఇక్కడ జనరల్‌ మెడిసిన్‌, డెంటల్‌, ఫిజియోథెరపి వైద్య సేవలతో పాటు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. ఇతర వ్యాధులకు సంబంధించిన బయటి వైద్యులు పరీక్షించి రాసిన మందులను అందజేస్తారు. కానీ పది నెలల కాలంగా వెల్‌నెస్‌ సెంటర్‌లో మందులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో హెల్త్‌కార్డుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సగం మందులు లేకపోవడంతో ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో కొనాల్సి వస్తోంది. పభుత్వం వెంటనే స్పందించి మందులు అందుబాటులో ఉంచాలని హెల్త్‌ కార్డుదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ పది నెలలుగా అరకొరే..

ఫ మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేస్తున్న రోగులు

ఫ మందులు అందుబాటులో ఉంచాలని హెల్త్‌కార్డుదారుల వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement