మాదిగ ఉద్యోగుల ఐక్యతతోనే సామాజిక అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మాదిగ ఉద్యోగుల ఐక్యతతోనే సామాజిక అభివృద్ధి

Nov 25 2026 4:00 AM | Updated on Nov 25 2026 4:00 AM

మిర్యాలగూడ : మాదిగ ఉద్యోగుల ఐక్యతతోనే సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించిన మాదిగ ఉద్యోగుల సమాఖ్య మిర్యాలగూడ డివిజన్‌ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ముందుకు సాగినప్పుడే ఆశించిన మార్పు సాధ్యమవుతుందన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో పయనించాలని, భావితరాలకు మెరుగైన భవిష్యత్‌ను అందించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం ఉద్యోగుల మధ్య పరస్పర పరిచయాలు, స్నేహభావం, ఐక్యతను పెంపొందించడంతోపాటు సామాజిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఫ మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement