నేడు ఎన్‌డీసీఎంఎస్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు ఎన్‌డీసీఎంఎస్‌ సమావేశం

Nov 25 2026 4:00 AM | Updated on Nov 25 2026 4:00 AM

నల్లగొండ (నల్లగొండ టౌన్‌) : నల్లగొండ జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం ఉదయం 11గంటలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు బిజినెస్‌ మేనేజర్‌ నాగిళ్ల మురళి మంగళవారం తెలిపారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షులు, బి క్లాస్‌ సభ్యులు హాజరై డీసీఎంఎస్‌ మార్క్‌ఫెడ్‌లో విలీనంపై సలహాలు, సూచనలు అందించాలని కోరారు.

బేస్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

మిర్యాలగూడ: ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ బేస్‌బాల్‌ పోటీలకు నల్లగొండ జిల్లా జట్ల ఎంపిక ప్రక్రియను మంగళవారం మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు అమరావతి సైదులు, చిర్ర మల్లేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలకు 170 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని జూనియర్‌, సీనియర్‌ విభాగాల పురుషుల, మహిళల జట్లకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న జూనియర్‌ జట్లు డిసెంబర్‌ 11 నుంచి 14 వరకు కోదాడలోని కేఆర్‌ డిగ్రీ కళాశాలలో, సీనియర్‌ జట్లు డిసెంబర్‌ 23 నుంచి 26 వరకు సంగారెడ్డి జిల్లాలో జరిగే టోర్నమెంట్లలో పాల్గొంటాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, పాశం నర్సింహారెడ్డి, లక్ష్మణ్‌, సుజాత, మంజుల, పృథ్వీ, శేఖర్‌, మురళి, పరమేశ్‌, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

రామగిరి (నల్లగొండ): ఎల్‌ఐసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నల్లగొండ బ్రాంచ్‌ 1, బ్రాంచ్‌ 2 లకు 2026–27 సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గ కమిటీలు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. బ్రాంచ్‌ 1 నూతన కమిటీ అధ్యక్షుడిగా కొప్పు వెంకన్న, ఉపాధ్యక్షుడిగా వింజమూరి శ్రీనివాస్‌, కార్యదర్శిగా ఐతగోని లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శులుగా గుండగోని శ్రీనివాస్‌, యర్కల యాదగిరి, కోశాధికారిగా లకడాపురం రామకృష్ణ, డివిజన్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా దేవగిరి అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా పల్లపు లింగయ్య, శ్రీరామదాసు యాదగిరి, మద్దూరి రామకృష్ణ, బొల్లు సుధాకర్‌, పాలెం శ్రీకాంత్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా నల్లగొండ బ్రాంచ్‌ 2 నూతన కమిటీ అధ్యక్షుడిగా ఏర్పుల యాదగిరి, కార్యదర్శిగా చిలుకూరి రమేష్‌, సంయుక్త కార్యదర్శిగా పెద్ది రమేష్‌గౌడ్‌, కోశాధికారిగా కె.చంద్రమోహన్‌, డివిజనల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా వేముల శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులుగా మహ్మద్‌ అఫ్సర్‌, జి.లక్ష్మణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హరిహరులకు

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. కార్తీక పౌర్ణమి కలిసి రావడంతో మంగళవారం హరిహరులకు విశేషంగా పూజలు జరిపించారు. అనంతరం శ్రీనృసింహస్వామికి అభిషేకం, ఆరాధన, సహస్రనామార్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement