పారదర్శకంగా కులగణన చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా కులగణన చేపట్టాలి

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

నల్లగొండ టౌన్‌ : దేశంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలంటే పారదర్శకంగా కులగణన చేపట్టాలని బీసీ మేధావుల వేదిక (బీసీఐఎఫ్‌) జిల్లా చీఫ్‌ సమన్వయకర్త నేలపట్ల చంద్రశేఖర్‌ అన్నారు. ఈ మేరకు ఆ వేదిక జిల్లా ప్రతినిధులు గురువారం జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ద్వారా భారత రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జనగణన ప్రక్రియలో అవసరమైన మార్పులు చేసి, వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన సరైన గుర్తింపు, ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రం ప్రతిని రాష్ట్రపతి కార్యాలయానికి ఈ–మెయిల్‌ ద్వారా కూడా పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీఐఎఫ్‌ బాధ్యులు చామల చంద్రశేఖర్‌, ఎంఏ.కరీం, శిరసవాడ చంద్రం, తిరందాసు రాందాసు, బ్రహ్మచారి, గోవర్ధన్‌, మెండె శేఖర్‌, మాదగాని శంకరయ్య, సీతారాములు, సికలంపట్ల శ్రీనివాస్‌, బొమ్ము కష్ణయ్య, సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement