కొండమల్లేపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కరెంటు కష్టాలు వచ్చాయని, ఫలితంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు నిరంతర విద్యుత్ను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎల్నినలో ప్రభావంతో కరెంటు సమస్యలు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే వచ్చాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ను అందించాలని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7వేల మెగావాట్ల స్థాయి నుంచి 20వేల మెగా వాట్లకు పెంచిందన్నారు. ఈ ఉత్పత్తికి సంబంధించి భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని దామరచర్ల, కొత్తగూడెం ప్లాంట్లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి కేంద్రాలను నిర్వీర్యం చేసి విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు లేదని చెబుతున్నారన్నారు. సింగరేణి నుంచి పక్క రాష్ట్రాలకు బొగ్గును తరలిస్తూ.. తెలంగాణను చీకట్లోకి నెట్టేయాలన చూస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు తక్షణ ఆర్థికసహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు దసృనాయక్, సర్పంచులు తులసీరాం, దీప్లా నాయక్, మాజీ సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, అర్వపల్లి నర్సింహ, రావుల వెంకటయ్య, శ్రీను, వెంకటేష్, నాని తదితరులు పాల్గొన్నారు.
ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్


