నల్లగొండ టౌన్: జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృత పరుస్తామని ఆ సంస్థ నూతన చైర్‌పర్సన్‌గా డాక్టర్ హేమలత అన్నారు. గురువారం ఆమె నల్లగొండలోని జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాలు, ద్వారా వైద్య, సామాజిక సేవలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రెడ్‌క్రాస్ ప్రతినిధులు, కమిటీ సభ్యులు డాక్టర్ హేమలతను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ భీమనపల్లి శ్రీకాంత్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిన్నభిక్షమయ్య, కోశాధికారి కుంభం జ్యోతి, రెడ్‌క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరాములు, ఈసీ సభ్యులు గోలి అమరేందర్‌రెడ్డి, గుంటి రామకృష్ణ, చిలుకూరు పరమాత్మ, గుర్రం ప్రభాకర్‌రెడ్డి, సుధారాణి, లతాకుమారి, నన్నూరి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ చైర్‌పర్సన్‌గా
బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ హేమలత


