అక్షయ తృతీయకు అంతంత మాత్రమే! | - | Sakshi
Sakshi News home page

అక్షయ తృతీయకు అంతంత మాత్రమే!

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

రామగిరి(నల్లగొండ) : అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. హిందూ సంప్రదాయంలో బంగారం, వెండి కొనుగోలుకు అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు. కానీ ఈ ఏడాది పసిడి ధరలు సామాన్యుడిని భయపెడుతుండడంతో ఈసారి కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం లక్ష రూపాయలలోపే ఉండగా ఇప్పుడు ఆ ధర భారీగా పెరిగింది. లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని నగల షాపుకెళ్తే తులం బంగారం రావడం లేదు. 2025 అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.96,000 నుంచి రూ.97,000 మధ్య ఉంది. అంటే సుమారు లక్ష రూపాయలు ఉంటే ఒక తులం బంగారం కోనే వీలుండేది. కానీ ఇప్పుడు బంగారం, వెండి ధరలు పోటీపడి పెరుగుతుండడంతో ప్రజలు బంగారం కొనేందుకు ఆలోచిస్తున్నారు.

ఫ ఈ ఏడాది తగ్గిన బంగారం విక్రయాలు

ఫ ధరలు పెరగడంతో ఆసక్తి చూపని ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement