గొడుగులు చేతబట్టి ‘బడిబాట’ | - | Sakshi
Sakshi News home page

గొడుగులు చేతబట్టి ‘బడిబాట’

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

మర్రిగూడ : మండలంలోని దామెరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు సోమవారం ఎర్రటెండలో సైతం గొడుగులు చేతబట్టి వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమం చేపట్టారు. గొడుగుల నీడలో ఇల్లిళ్లు తిరిగి పిల్లలను ప్రభుత్వ బడిలోకే పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాద్యాయుడు ఉదావత్‌ లచ్చిరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌, మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారన్నారు. దీనికితోడు ప్రస్తుతం అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వై.మంజులత, కొండ శ్రీనివాస్‌, సబావత్‌ వెంకట్‌కుమార్‌, మీనా, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement