మిర్యాలగూడ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లులు అంతా బూటకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కేరళ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పోలీస్ పాలన సాగుతోందని, కార్మికుల పోరాటాలను పోలీసులతో అణిచి వేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వచ్చే నెల 1న మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, మల్లు గౌతంరెడ్డి, మంగారెడ్డి, రవినాయక్, బావండ్ల పాండు, పరుశురాములు, సీతారాములు, మసూద్, వరలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి
ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి


