ప్రగతి చక్రానికి బ్రేకులు | - | Sakshi
Sakshi News home page

ప్రగతి చక్రానికి బ్రేకులు

Apr 22 2026 7:48 AM | Updated on Apr 22 2026 7:48 AM

డిపోల వారీగా బస్సులు, సిబ్బంది వివరాలు ఇలా..

అద్దె బస్సులు నడుపుతాం

మిర్యాగూడ టౌన్‌ : ప్రగతి చక్రానికి బ్రేకులు పడుతున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ లక్ష్యంగా జాయంట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేపడుతున్నారు. ఆర్టీసీలో 2019 తరువాత ఇప్పుడు కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారు. దీంతో బస్సులు డిపోల్లోనే నిలిచిపోనున్నాయి. ఏడేళ్ల క్రితం 54 రోజుల సమ్మెతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డిపోలున్నాయి. వీటి పరిధిలో ఆర్టీసీ బస్సులు 329, అద్దె బస్సులు 235, ఎలక్ట్రికల్‌ బస్సులు 169 మొత్తం 733 బస్సులు ఉన్నాయి. డ్రైవర్లు 719 మంది, కండక్టర్లు 1012 మంది, గ్యారేజి సిబ్బంది 264 మంది మొత్తం 1,995 మంది పనిచేస్తున్నారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం ఖర్చులను తగ్గించుకునేందుకు టిమ్స్‌ డ్యూటీలు వేస్తోందని కార్మికులు అంటున్నారు. 12 నుంచి 16 గంటల వరకు డ్యూటీలు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ‘మహాలక్ష్మి’ పథకం కింద ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండడంతో ఒక్కో బస్సులో సుమారు 100 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. దీని వల్ల డ్రైవర్లు, కండక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లకు టిమ్స్‌ ఇవ్వడంతో బస్సులు నడుపుతూ, టికెట్ల కొట్టడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని సంరక్షించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టారు.

డిపోలు బస్సులు ఉద్యోగులు

దేవరకొండ 106 352

కోదాడ 86 279

మిర్యాలగూడ 106 287

నల్లగొండ 154 307

నార్కట్‌పల్లి 27 99

సూర్యాపేట 159 327

యాదగిరిగుట్ట 95 344

సమ్మెలోకి ఆర్టీసీ కార్మికులు

ఫ డిపోలకే పరిమితం కానున్న బస్సులు

ఫ ప్రయాణికులకు తప్పని పాట్లు

ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్తే ప్రస్తుతం ఉన్న అద్దె బస్సులను నడిపించేందుకు ప్రత్యేక చర్యలను చేపడతాం. అయితే కొంత మంది ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లో వీధులకు హాజరవుతారనే నమ్మకం ఉంది. వారి ద్వారా కూడా బస్సులను నడుపుతాం. ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం మేరకే చర్యలు చేపడతాం.

– కొణతం జాన్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ

Advertisement
 
Advertisement
Advertisement