ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

Apr 22 2026 7:48 AM | Updated on Apr 22 2026 7:48 AM

నల్లగొండ : ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్‌)లో కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి పౌర సరఫరాలు, మార్కెటింగ్‌, డీఆర్‌డీఏ, రవాణా, కోఆపరేటివ్‌ తదితర శాఖల అధికారులు, మిల్లర్లతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలను దృష్టిలో ఉంచుకుని పగలు, రాత్రి.. అవసరమైతే లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం కాంటాలు వేయాలని, వారం పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్రాల సంఖ్య, లారీలను పెంచి రోజుకు 10 వేల మెట్రిక్‌ టన్నులు కొనాలన్నారు.

రోడ్డు నిర్మాణంలో అవినీతికి ఆస్కారం లేదు

నల్లగొండ నగరంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్కుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామన్నారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో అవకతవకలంటూ ఓ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరైతే.. భూసేకరణకే రూ.250 కోట్లు పోతుందని, పనులన్నీ నేషనల్‌ హైవే అధికారులు చూసుకుంటారని.. అందులో ఎవరి ప్రమేయం ఉండదని చెప్పారు. నీలగిరిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా కృష్ణా జలాలు అందించాలన్నారు. కార్యక్రమంలో మేయర్‌ బుర్రి చైతన్య, కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, అశోక్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశం, మార్కెటింగ్‌ ఏడీ ఛాయాదేవి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌, రవాణా శాఖ అధికారి లావణ్య నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, జూకూరి రమేష్‌ పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement